AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకిల్ దిగనున్న మరో మాజీ మంత్రి..?

టీడీపీకి ఈ మధ్య షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొంతమంది వైసీపీలోకి వెళ్తుంటే.. మరికొంతమంది బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే.. ఎంపీ గరికపాటి బీజేపీలో చేరారు. ఆయన ఎందుకు జాయిన్ అయ్యారో బీజేపీ సభలోనే వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీలోకి మరో మాజీ మంత్రి జంప్ అవుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులోనూ.. సీఎం రమేష్‌తో సన్నిహితంగా ఎక్కువగా ఉంటారు కూడా.. దీంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆయనెవరనేది […]

సైకిల్ దిగనున్న మరో మాజీ మంత్రి..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 10:58 AM

Share

టీడీపీకి ఈ మధ్య షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొంతమంది వైసీపీలోకి వెళ్తుంటే.. మరికొంతమంది బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే.. ఎంపీ గరికపాటి బీజేపీలో చేరారు. ఆయన ఎందుకు జాయిన్ అయ్యారో బీజేపీ సభలోనే వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీలోకి మరో మాజీ మంత్రి జంప్ అవుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులోనూ.. సీఎం రమేష్‌తో సన్నిహితంగా ఎక్కువగా ఉంటారు కూడా.. దీంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆయనెవరనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. ఇంకెవరు.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.

ఆదినారాయణరెడ్డి ఇప్పటికే.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో.. వైసీపీపై ఒక రేంజ్‌లో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. సో.. మళ్లీ వైసీపీలోకి వెళ్లాలంటే.. కష్టం. అందుకే ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారని సమాచారం. అలాగే.. 2019 తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీచేశారు ఆదినారాయణ రెడ్డి.

Ex TDP Minister Adinarayana Reddy Ready to Join in BJP?