BJP MP Aravind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి ఝలక్..! ‘ఇకపై ఆ గ్రామాల్లోనే పర్యటిస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా!’

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లారంపూర్​లో పసుపు రైతులు అడ్డుకున్నారు...

BJP MP Aravind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కి ఝలక్..!  ఇకపై ఆ గ్రామాల్లోనే పర్యటిస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా!
Bjp Mp Aravind

Updated on: Jun 29, 2021 | 12:07 AM

BJP Mp Aravind : బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లారంపూర్​లో పసుపు రైతులు అడ్డుకున్నారు. స్థానిక సహకార సొసైటీలో డిపాజిట్ల అక్రమాలు జరిగాయంటూ రైతుల చేపట్టిన ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లిన అర్వింద్​ కు ఈ మేరకు చేదు అనుభవం ఎదురైంది. బోర్డ్ ఏర్పాటుకు బాండ్​ పేపర్​ రాసి ఇచ్చి.. ఇంత వరకు నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఎంపీ.. రైతులతో మాట్లాడడానికి ప్రయత్నిచినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను చెదరకొట్టారు.

టీఆర్ఎస్ అక్రమాలను బయట పెడుతున్నామనే.. కార్యకర్తలను పంపించి తమను అడ్డుకుంటున్నారని అరవింద్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు అన్ని చూస్తునే ఉన్నారున్న అరవింద్, ఇకపై గ్రామాల్లో పర్యటిస్తా ఎవరు అడ్డుకుంటారో చూస్తా.. అంటూ ఫైరయ్యారు.

మమ్మల్ని అడ్డుకున్నట్లే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను బీజేపీ శ్రేణులు అడ్డుకుంటారు అని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటిస్తే ముందస్తు అరెస్ట్​లు చేసినప్పుడు.. ఓ ఎంపీ పర్యటించినప్పుడు చేయరెందుకు..? అని ఆయన నిలదీశారు. నిజామాబాద్ పర్యటనలో ఇక ముందు బాల్కొండ నియోజకవర్గంలోనే తిరుగుతా. పసుపు రైతులు ఉన్న గ్రామాల్లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా అని ప్రకటించారు అరవింద్.

Read also : DGP Mahender Reddy : తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : డీజీపీ మహేందర్​ రెడ్డి