యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్!

| Edited By:

Mar 30, 2019 | 8:22 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఈ పార్టీలతో జట్టుకట్టి ముచ్చటగా మూడురోజులు గడవక ముందే నిషద్ పార్టీ గుడ్‌బై చెప్పేసింది. నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌తో సమావేశమైన కొద్ది సేపటికే… ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వేరుపడుతూ ప్రకటన వెలువడింది. సీఎం యోగితో సమావేశమైన వారిలో సంజయ్ నిషద్ కుమారుడు, గోరఖ్‌పూర్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్, యూపీ మంత్రి సిద్ధార్థ్‌ […]

యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమికి షాక్!
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఊహించని షాక్ తగిలింది. ఈ పార్టీలతో జట్టుకట్టి ముచ్చటగా మూడురోజులు గడవక ముందే నిషద్ పార్టీ గుడ్‌బై చెప్పేసింది. నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌తో సమావేశమైన కొద్ది సేపటికే… ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి వేరుపడుతూ ప్రకటన వెలువడింది.

సీఎం యోగితో సమావేశమైన వారిలో సంజయ్ నిషద్ కుమారుడు, గోరఖ్‌పూర్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్, యూపీ మంత్రి సిద్ధార్థ్‌ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన‌ వెలువడలేదు. కాగా తాము కూటమిలో చేరినప్పటికీ తమ పేర్లు పోస్టర్లలో, లెటర్లలో ఎక్కడా కనిపించడంలేదనీ… దీనిపై తమ కార్యకర్తలు కలత చెందారని సంజయ్ నిషద్ పేర్కొన్నారు. ఇప్పుడు తాము కూటమిలో లేనందున స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటామనీ.. స్వతంత్రంగా పోటీచేయడంతో పాటు ఇతర అవకాశాలపైనా ఆలోచన చేస్తామని ఆయన తెలిపారు.