టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న నారా రోహిత్

టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినీ హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 3 నుంచి 9వరకు దాదాపు వారం రోజులపాటు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 3న రాజమహేంద్రవరం ,కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4 తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 5న రేపల్లె, తెనాలి, పత్తిపాడు, ఏప్రిల్ 6న చిలకలూరిపేట, పర్చూరు, […]

టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న నారా రోహిత్

Updated on: Apr 02, 2019 | 8:30 PM

టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు తమ్ముడి కొడుకు, సినీ హీరో నారా రోహిత్ సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 3 నుంచి 9వరకు దాదాపు వారం రోజులపాటు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 3న రాజమహేంద్రవరం ,కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4 తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 5న రేపల్లె, తెనాలి, పత్తిపాడు, ఏప్రిల్ 6న చిలకలూరిపేట, పర్చూరు, చీరాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏప్రిల్ 7న ఉరవకొండ, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8, 9న చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.