‘జగన్’ స్కామ్ స్టార్..! వైసీపీ బాగోతం బయటకొచ్చింది: లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ ఆస్కార్ తప్పకుండా వస్తుందని.. అంతబాగా నటిస్తున్నారని ఘాటుగా ఆరోపణలు కురిపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని ట్వీట్‌లో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ ఆస్కార్ తప్పకుండా వస్తుందని.. అంతబాగా నటిస్తున్నారని ఘాటుగా ఆరోపణలు కురిపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని ట్వీట్‌లో పేర్కొన్నారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం కన్నా.. వైసీపీ కార్యకర్తా.. లేదా అనేది మాత్రమే చూస్తున్నారని వ్యాఖ్యానించారు లోకేష్.
.@ysjaganగారు స్కామ్ స్టార్ అని మరోసారి ఆధారాలతో రుజువైంది. గ్రామ వాలంటీర్ల స్కామ్ తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్ గారు ఆస్కార్ రేంజిలో నటిస్తుంటే, కడుపులో దాచుకోలేక వైకాపా స్కామ్ ని దొంగలెక్కల వీరుడు బయటకి కక్కేశారు pic.twitter.com/r9y3eJU8wd
— Lokesh Nara (@naralokesh) August 12, 2019
వాలంటీర్ల నియామకంలో కులం, మతం చూడలేదు వైకాపా కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూసాం అని స్వయంగా ప్రకటిస్తున్నారు. నాలుగు లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైకాపా వాలంటీర్ల స్కీం.
— Lokesh Nara (@naralokesh) August 12, 2019