నేను విన్నాను.. ఉన్నానన్న జగన్ ఎక్కడ.. లోకేష్

| Edited By: Srinu

Jul 03, 2019 | 5:05 PM

ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా.. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీపై విరుచుకు పడుతూ.. వరుస ట్వీట్లు చేశారు. వైసీపీ అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా అంటూ జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే..చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారని అనడం ఏంటంటూ.. ప్రశ్నించారు. ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు […]

నేను విన్నాను.. ఉన్నానన్న జగన్ ఎక్కడ.. లోకేష్
Follow us on

ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా.. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీపై విరుచుకు పడుతూ.. వరుస ట్వీట్లు చేశారు.

వైసీపీ అధికారంలో ఉంద‌ని మ‌రిచిపోయారా అంటూ జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. విత్త‌నాలో జ‌గ‌న్ ప్ర‌భో అంటూ రైతులు గ‌గ్గోలు పెడుతుంటే..చంద్ర‌బాబు వ‌ల్లే విత్త‌నాలు ఇవ్వ‌లేక‌పోతున్నామంటున్నారని అనడం ఏంటంటూ.. ప్రశ్నించారు. ఒక‌టో తారీఖుకొచ్చే పింఛ‌ను రాలేదేమ‌ని పండుటాకులు నిల‌దీస్తే.. దానికి కూడా గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌ని స‌మాధానం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక బీమా రాలేదని.. మా బతుకులకు ధీమా ఏదీ అంటే.. దానికి కూడా టీడీపీ సర్కార్ వల్లే అంటూ వైసీపీ నేతలు మాట దాటవేస్తున్నారంటూ మరో ట్వీట్ చేశారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. సీఎం అయిన జగన్.. పాలన చేతకాక, ఇప్పుడు చంద్ర‌బాబే వింటాడు, చంద్ర‌బాబే ఉంటాడు అంటున్నారని ఛలోక్తులు విసిరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం వెల‌గ‌బెడుతున్న‌ది వైసీపీనా? టీడీపీనా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.