Nandamuri Chaitanya krishna : ‘కొడాలి నాని..! లోకేష్ జోలికొస్తే తాట తీస్తా..’ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నందమూరి వారసుడు

వైసీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై నటుడు, వ్యాపార వేత్త నందమూరి చైతన్య కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు...

Nandamuri Chaitanya krishna : కొడాలి నాని..!  లోకేష్ జోలికొస్తే తాట తీస్తా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నందమూరి వారసుడు
Nandamuri Chaitanya Krishna

Updated on: Jun 23, 2021 | 7:03 PM

Nandamuri Chaitanya Krishna : వైసీపీ నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై నటుడు, వ్యాపార వేత్త నందమూరి చైతన్య కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని… ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న ఆయన, ఇప్పటికే బూతుల మంత్రి అని కొడాలి ముద్ర వేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉండి వెధవ, సన్నాసి, దద్దమ్మ, పప్పు అంటూ లోకేష్ ను తిట్టడం పై చైతన్య కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేష్ యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారని, లోకేష్ ను, చంద్రబాబును విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని చైతన్య కృష్ణ అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కిలోమీటర్ల రహదారిని వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో చైతన్య కృష్ణ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. వైసిపి నాయకులు ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారించాలని చైతన్య కృష్ణ సూచించారు. చంద్రబాబు పై ఒక అవినీతి కేసు కూడా లేదని, రౌడీయిజం గూండాయిజం అటువంటివి చంద్రబాబు ఇంటా వంటా లేవని, లోకేష్ కూడా అదే బాటలో నడిచిన నాయకుడని చైతన్య కృష్ణ కితాబిచ్చారు.

పేకాట క్లబ్బులు నిర్వహించే చరిత్ర కొడాలి నానిదని చైతన్య కృష్ణ విమర్శలు చేశారు. కొడాలి నానిని సీఎం జగన్ ప్రోత్సహించడం వల్లే ఇలాంటి మాటలు వస్తున్నాయని చైతన్య కృష్ణ ఆరోపించారు.

Read also : CM YS Jagan – Chiranjeevi: చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్