చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా సర్పంచి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. పుత్తూరు మండలం వేపగుంట కృష్ణ సముద్రంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాలనలో వాలంటరీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అందించడం జరిగిందని రోజా తెలిపారు. తద్వారా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆమె తెలిపారు.
గ్రామ అభివృద్ధికి సర్పంచ్, వార్డు సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సీఎం జగన్‌కు సర్పంచ్, వార్డుమెంబర్లు చేదోడుగా ఉంటూ రాస్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం పూర్తిగా సహకరిస్తానని రోజా హామీ ఇచ్చారు. అనంతరం వేపగుంట గ్రామంలో ఆర్.ఓ.ప్లాంట్ ను రోజా ప్రారంభించారు.
Read more:
గులాబీ పార్టీకి సీనియర్ నేత గుడ్‌బై.. వైయస్ షర్మిల పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటన