ఎవరినైనా నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలడు

‘‘ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలడు’’ అంటూ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఘాటు విమర్శలు చేశారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుపోయిందని మోహన్ బాబు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకొని వదిలేశారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్‌)ది కాదని.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ అని.. అన్నయ్యేదే […]

ఎవరినైనా నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలడు

Edited By:

Updated on: Apr 01, 2019 | 12:45 PM

‘‘ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలడు’’ అంటూ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఘాటు విమర్శలు చేశారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుపోయిందని మోహన్ బాబు ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకొని వదిలేశారని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్‌)ది కాదని.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ అని.. అన్నయ్యేదే అయితే తాను పార్టీ వీడేవాడినే కాదంటూ మోహన్ బాబు అన్నారు. ఎన్టీఆర్ పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు చేశారు. చంద్రబాబుపై అప్పట్లో వీడియోలు విడుదల చేసిన ఎన్టీఆర్.. పాపిష్టి, నికృష్ణుడు, మోసకారి అంటూ విమర్శలు చేశారని మోహన్ బాబు గుర్తు చేశారు. వైస్రాయ్‌ హోటల్‌ వద్ద అన్నయ్యపై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను కూడా చూశానని మోహన్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.