బాబుకు పోలవరం ఏటీఎం అయిపోయింది- మోదీ

|

Apr 01, 2019 | 5:09 PM

రాజమహేంద్రవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీ సీఎం చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను తెలుగుదేశం ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈ విధంగా డబ్బు అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.. ఇప్పటి వరకు రూ.7వేల కోట్ల నిధులిచ్చామని […]

బాబుకు పోలవరం ఏటీఎం అయిపోయింది- మోదీ
Follow us on

రాజమహేంద్రవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీ సీఎం చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను తెలుగుదేశం ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈ విధంగా డబ్బు అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.. ఇప్పటి వరకు రూ.7వేల కోట్ల నిధులిచ్చామని చెప్పారు. గత 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోదీ ఆరోపించారు. సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబుగా, యూటర్న్ బాబుగా మారారని ప్రధాని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడిలా మారిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మోదీ విమర్శించారు. ఆయన మాటలను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. ‘ఏపీ హెరిటేజ్‌ను కాపాడటం తమ పని.. తన హెరిటేజ్‌ను కాపాడుకోవడం చంద్రబాబు పని’ అంటూ మోదీ ఎద్దేవా చేశారు. దేశంలోని ఉన్నత వర్గాల్లోని నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేంద్రానిదే అన్నారు మోదీ. ఐదేళ్లలో దేశ గతిని మార్చేశామని, మరో ఐదేళ్లూ మంచి పాలన అందించడానికి ప్రజల ఆశీర్వాదం కావాలని మోదీ అభ్యర్థించారు.