ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండేళ్ల కాలం పూర్తయినా .. ఇప్పటి వరకు మంత్రివర్గంలో మార్పులు – చేర్పులు చోటు చేసుకోలేదు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టటం.. మరో ఆరు నెలల కాలంలోనే అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ప్రధాని మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం ఉండేటా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో NDA వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. కానీ, ఈ సారి తెలంగాణకు మరో మంత్రి పదవి ఇవ్వటంతో పాటుగా ఏపి నుండి ఒకరికి అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం బీజేపీకి లోక్ సభ సభ్యులు లేక పోవడంతో రాజ్యసభ నుండి జీవీఎల్ నరసింహారావు ఒక్కరే కనిపిస్తున్నారు. వాస్తవంగా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ నుండి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా సురేష ప్రభు కూడా ఉన్నారు. అయితే, జీవీఎల్ అటు కేంద్ర నేతలతో సత్సంబంధాలే.. పార్టీకి విధేయుడనే పేరు ఉంది. దీంతో..ఆయనకు అవకాశం ఇస్తారా… లేక ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా నలుగురు నేతలు సురేశ్ ప్రభు, వైఎస్ చౌదరి, సీఎం రమేశ్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. TG వెంకటేష్‌లో ఒకరికి చాన్స్ వచ్చే అవకాశం ఉంది. వీరితోపాటు పార్టీ సీనియర్ నేత పురంధేశ్వరికి చాన్స్ ఇస్తారని చర్చ మొదలైంది. ఇదిలావుంటే.. ఏపీలో సామాజిక సమీకరణాలే రాజకీయాలను డిసైడ్ చేసే స్థాయిలో ఉండటంతో… అటువైపుగా బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తే మాత్రం లెక్కలు మారే ఛాన్స్ కనిపిస్తోంది.
అందులో భాగంగా.. ఏపీలో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీకి అవకాశం ఇస్తారనే ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తమకు తగిన గుర్తింపు బీజేపీ నేతలు ఇవ్వటం లేదనే భావన ఆ పార్టీలో ఉంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే అభిప్రాయాన్ని ఉన్నారు. జనసేనానికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వటం ద్వారా తెలంగాణలోనూ ఆయన ద్వారా బీజేపీకి ప్రయోజనం ఉంటుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే జనాకర్షణ కలిగిన నేత అవసరమని.. బీజేపీ కేంద్ర నాయకులతో ఆర్‌ఎస్ఎస్‌కు చెందిన ఓ ముఖ్య నేత తెలిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అదే నేత పవన్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశంలో ..పొత్తు అంశంలో కీలకంగా వ్యవహరించారు. అయితే పవన్ కళ్యాణ్‌తోపాటు
బీజేపీ అనుబంధ విభాగానికి చెందిన మరో యువ నేత సైతం ఆ దిశగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందు కోసం త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుండి అయినా పవన్ కు అవకాశం కల్పించవచ్చని..ముందుగా మంత్రి పదవి ఇవ్వటం మంచిదని వారికి సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది.