Talasani Srinivas Yadav : గంగపుత్రులకు మంత్రి తలసాని సారీ చెప్పారు. కొద్ది రోజుల క్రితం గంగపుత్రుల పై వివాదాస్పద కామెంట్స్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా గంగ పుత్రులు మంత్రి వ్యాఖ్యలపై ఆందోళనలు నిర్వహించారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని తలసాని అంటున్నారు.
నాలుగు రోజుల క్రితం కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, తలసాని పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ఇన్ డైరెక్ట్‌గా గంగపుత్రులపై కొన్ని వ్యాఖ్యలు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు.
ముదిరాజులు ఇక ఎవరి దయా దాక్షిణ్యాల కింద ఉండాల్సిన అవసరం లేదంటూ గంగపుత్రులను ఉద్దేశించి మాట్లాడారు. మత్స్యకార సొసైటీలలో అందరికీ సభ్యత్వం ఉందని.. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు ప్రకటించారు. దీంతో గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో గంగపుత్రులు తలసాని వ్యాఖ్యలపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు గంగపుత్రుల నుండి వ్యతిరేకత ఎక్కువ కావడంతో మంత్రి క్షమాపణ చెబుతున్నట్లుగా వీడియో రిలీజ్ చేశారు.
తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే గంగపుత్రులకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ మంత్రి తలసాని చెప్పుకొచ్చారు. ముదిరాజులను ఉత్తేజ పరచడానికి మాట్లాడిన మాటలను తప్పుగా భావించడం గంగపుత్రులు కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.