తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆఖరు రోజున విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ ఖమ్మం NRI పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి సతీమణి పల్లా నీలిమతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పువ్వాడ అజయ్ పట్టభద్రులనుద్దేశించి మాట్లాడుతూ మీరు చాలా విజ్ఞులు. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు చేయగలరో మీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించండి. విశ్లేషించండి. అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని కోరారు. పని చేసే ప్రభుత్వం ఏమి చేస్తుంది.. మిగతా వాళ్ళు చేసిందేంటి? ఆలోచించండి. అప్పుడు, ఇప్పుడు గ్రామాలు, నగరాలు ఎలా ఉన్నాయి? కరెంటు ఎలా ఉంది? చూడండి. గతంలో ప్రతి అపార్ట్మెంట్ కి జనరేటర్ ఉండేది. ప్రతి ఇంట్లో ఇన్వెర్టర్ లు ఉండేది. ఇపుడు వాటి వినియోగం ఉందా. నాటికి నేటికి ఉన్న తేడాను గమనించాలని కోరారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది చేస్తున్నారు. చెప్పనిది కూడా చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉన్నాం. అనేక ప్రభుత్వ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అనేక అవకాశాలు కలిపించిన విషయం మీకు తెలుసు, కొత్త రాష్ట్రం అయినప్పటికీ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉపాధి విషయంలో ఎక్కడ లోటు చేయలేదన్నారు. సంకేతిక రంగాన్ని ఖమ్మం గుమ్మంలోకి తీసుకొచ్చామని అదే ఖమ్మం IT-Hub ను తెచ్చి జిల్లా వాసులకు it sector లో ఉద్యోగ కల్పన చేశామన్నారు. వాళ్ళకి మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం అనేక రంగాల్లో విప్లవాత్మిక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వైద్యంలో పారదర్శకత, రవాణా శాఖలో 17 సేవలు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ లో పొందే సౌకర్యం, గృహాల అనుమతులు ts-bpass ద్వారా మున్సిపల్ కార్యాలయంకు వెళ్ళకుండానే అనుమతులు పొందటం, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీరు, ఒక్క ఖమ్మం కార్పొరేషన్ లోనే 16 OHRS ట్యాంక్ లు నిర్మించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వడం, గతంలో ఖమ్మంలో 15వేలు నల్లా కనెక్షన్స్ ఉంటే అవి నేడు 70వేల నల్లా కనెక్షన్స్ ఇచ్చామని, ఇంకా ఇస్తాంమని అన్నారు.
రైతులకు రైతు బంధు, రైతు భీమా, రైతుల సమస్యల పరిష్కరం కోసం రైతు వేదికలు, ఒకప్పుడు పక్కా రాష్ట్రాల నుండి వివిధ రకాల ధాన్యాలు దిగుమతి చేసుకుని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు మనం ధాన్యం మనమే పండించి అదే పక్కా రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని, rice bowl of telangana అనే స్థాయికి చేరుకున్నామని, దీనితో పాటు రైతులు పండించిన ధాన్యం సేకరణలో దేశంలోనే 10వ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు.
కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి తాత మధు గారు, చావా రమేష్ గారు, స్వరూప రాణి గారు, YV గారు, సిరిపురపు సుదర్శన్ గారు తదితరులు ఉన్నారు.