నీటి కేటాయింపుల విషయంలో అక్రమంగా వ్యవహరించడంలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మా రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కేటాయించారో అవే తీసుకుంటున్నామని… తెలంగాణకు నష్టం చేసి బాగుపడాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదన్నారు. మా వాటా నీళ్లు మేం తీసుకుంటాం.. అక్రమంగా నీళ్లు తీసుకోము . అక్రమ ప్రాజెక్టులను తాము కట్టడం లేద తెలిపారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ గురించి కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికి తెలుసన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా సీఎం జగన్‌కు చెప్పారని గుర్తు చేశారు. ఆ సమావేశంలో నాతో పాటు కామెంట్ చేసిన తెలంగాణ మంత్రి కూడా అక్కడ ఉన్నారని అన్నారు. రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని స్వయంగా కేసీఆర్ చెప్పిన దానికి స్వయంగా తానే సాక్ష్యం అని చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే.. సీఎం వైఎస్ జగన్ రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదని.. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో 90శాతం పల్ప్ ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు బంధువులవే అని అన్నారు. పల్ప్ కంపెనీలన్నీ సిండికేట్ అయి ధరలను ధరలను తగ్గించాయని…. ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.