ఆ ప్రాంతాలకు సురక్షిత మంచి నీటి వాటర్ గ్రిడ్.. నాడు-నేడు పనులను పరిశీలించిన మంత్రి మేకపాటి

|

Feb 27, 2021 | 5:31 PM

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. మెట్ట ప్రాంత..

ఆ ప్రాంతాలకు సురక్షిత మంచి నీటి వాటర్ గ్రిడ్.. నాడు-నేడు పనులను పరిశీలించిన మంత్రి మేకపాటి
Follow us on

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. మెట్ట ప్రాంత ప్రజలకు తాగే నీరు అందించేందుకు ఏడాదిన్నర లోగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల అవసరం గురించి ముఖ్యమంత్రికి వివరించగానే ఆయన వెంటనే స్పందించిన తీరు అద్భుతమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఏఎస్ పేట, ఆత్మకూరురూరల్ మండలాల్లో సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ గ్రిడ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తరకాలువ అభివృద్ది పనులు చకచకా పూర్తి చేస్తామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూ.700 కోట్లతో టెండర్లు పిలవడం కూడా జరిగిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెట్ట ప్రాంతంలో తాను పాదయాత్ర చేసే సమయంలో గండ్లవీడు గ్రామంలో జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. 2014లో అందరూ కలసి నన్ను గెలిపించారు. 2019లో మరోసారి గెలిపించిన నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గండ్లవీడు గ్రామంలో శ్రీరాములునాయుడు ఉమ్మడి కుటుంబం గురించి మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉమ్మడి కుటుంబం , ఆదర్శ కుటుంబంగా గండ్లవీడు ప్రజలకు ఈ కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉండే తీరు అభినందనీయమన్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఇండస్ట్రీయల్ పార్కు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. రూ.1000 కోట్లతో డీపీఆర్ కూడా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆత్మకూరు చుట్టు పక్కల గ్రామాల యువతకు ఉద్యోగాలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు ఐక్యమత్యంగా పని చేయడం..ప్రజల తీర్పు అద్భుతమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ లు ఎలాంటి గొడవలకు తావు లేకుండా గ్రామాభివృద్దిలోనూ ఐక్యత చాటాలన్నారు. గ్రామాభివృద్దికి అందరూ కలిసికట్టుగా శ్రమించాలన్నారు. అనంతరం గండ్లవీడు గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను మంత్రి మేకపాటి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, జాప్యం చేస్తే సహించనని మంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాల శుభ్రంగా లేకపోవడం, మరింత అభివృద్ది కోసం వివరాలను పంపాలని కోరారు.

Read more:

భీమవరం కేంద్రంగా పేలుతున్న డైలాగ్‌ బుల్లెట్లు.. జనసేనానికి రీకౌంటర్‌ ఇచ్చిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌