L.Ramana: గులాబీ గూటికి చేరిన ఎల్ ర‌మ‌ణ.. TRS పార్టీ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి KTR

|

Jul 12, 2021 | 12:59 PM

తెలంగాణ TDP మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి L.రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ఆయన TRS సభ్యత్వం తీసుకున్నారు.

L.Ramana: గులాబీ గూటికి చేరిన ఎల్ ర‌మ‌ణ.. TRS పార్టీ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి KTR
Ramana Trs
Follow us on

తెలంగాణ TDP మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి L.రమణ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా ఆయన TRS సభ్యత్వం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి KTR సాద‌రంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ‌.. TRS పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు మంత్రి KTRతో పాటు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ నెల 16న ఎల్‌ రమణ తన అనుచరులు, TDP నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో ముఖ్యమంత్రి KCR సమక్షంలో టీఆర్‌ఎస్‌లో లాంఛనంగా చేరుతారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌ లేదా కరీంనగర్‌లో సభ నిర్వహించనున్నట్టు తెలిసింది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎల్‌ రమణ ఈనెల 7న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యా రు.

ఆ మరుసటిరోజే రాష్ట్ర TDP అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని, సీఎం KCR నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నదని, ఈ ప్రగతి ప్రయాణంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని ఎల్‌ రమణ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Rajinikanth Confirms: పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన..

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..