పట్టభద్రుల ఓట్లడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు.. ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌

|

Feb 24, 2021 | 4:37 PM

బీజేపీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించిన..

పట్టభద్రుల ఓట్లడిగే హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు.. ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌
Follow us on

బీజేపీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించిన ఆయన గ్రాడ్యుయేట్ల ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఏం చేశారో చెప్పాలన్నారు. జీడీపీ పెంచుతామని చెప్పిన బీజేపీ… గ్యాస్‌, డీజీల్‌, పెట్రోల్‌ రేట్లను మాత్రం బాగా పెంచిందని విమర్శించారు.

తెలంగాణ వచ్చాక లక్షా 32 వేల 799 ఉద్యోగాలను ఇచ్చామని, దీనిపై చర్చకు సిద్ధమని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ MLC ఎన్నిక వ్యూహాలపై TRS భవన్‌లో చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు జరిగిన తర్వాత ప్రచారాన్ని మొదలు పెడతామన్నారు కేటీఆర్‌.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సురభి వాణి దేవిని పోటీకి దింపినట్లు పేర్కొన్నారు. పీవీకి గౌరవం ఇచ్చే విధంగా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబానికి గౌరవం దక్కేలా పీవీ కూతురు వాణి దేవికి ప్రతి విద్యావంతులు ఓటు వేయాలని కోరారు. ఆమెకు ఉన్న అర్హతలు, సానుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో 24వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, తెలంగాణలో 10వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు.

Read more:

తమ రక్తంలోనే ప్రజా సేవ ఉందన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పిన వాణిదేవి