తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

|

Feb 24, 2021 | 12:38 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం..

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
Follow us on

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించిన ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్‌ బేటీ అయ్యారు.

ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్థానంపై పార్టీలోని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్‌ అనూహ్యంగా పీవీ కుమార్తెను తెరపైకి తీసుకురావడం పట్ల రాజకీయంగా సంచలనంగా మారింది.

ఇక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందడం ఎలా? టైం తక్కువగా ఉంది కాబట్టి… వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలవడం ఎలా? అన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది గులాబీ దళం. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై TRS భవన్‌లో చర్చిస్తున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మూడు జిల్లాల పరిధిలోని మంత్రుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు సమీక్షకు హాజరయ్యారు. ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపై ఈ భేటీలో ఖరారమవుతుంది.

Read more:

మేడారం మినీ జాతర ప్రారంభం.. సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌