ఉద్యోగాలు ఇచ్చేది TRS పార్టీ.. ఉన్న ఉద్యోగాలను ఊడ గొట్టేది బీజేపీ పార్టీ అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇస్తున్నారు. మోత్కుల గూడెం 90శాతం టిఆర్ఎస్ వైపు వచ్చిందన్నారు. ఆరు సార్లు ఈటెల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు.. మరో రెండేళ్ల కోసం గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించండని అక్కడి ఓటర్లను అభ్యర్థించారు. 18ఏళ్లలో మీకు ఈటెల చెయ్యని పని.. మీ స్వంత జాగాలో ఇండ్లు కట్టించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. నాయిని చెరువు దగ్గర బతుకమ్మ ప్లాట్ ఫామ్, గణేష్ నిమజ్జనానికి ప్లాట్ ఫామ్ కట్టిస్తామని అన్నారు.
గడియారాలు, బొట్టు బిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగం అయిపోతారని.. రూపాయి బొట్టుబిల్ల ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా.. కళ్యాణ లక్ష్మి 1లక్ష 116 రూపాయలు ఇచ్చే టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్‌ని గెలిపించాలన్నారు. మోత్కులగుడెంలో 300 ఇండ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. రెండు గుంటల భూమి ఉన్న పేద వాడు శ్రీనివాస్.. మీ తలలో నాలుక లాగా మేదులుతాడని అతనికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిఅర్ఎస్ పార్టీవి సహాయం చేస్తున్న చేతులని.. పేదలకు భారం మోపుతున్న పార్టీ బీజేపీ అంటూ విమర్శలు గుప్పించారు. గెల్లు శ్రీను గెలుపు ఖాయం అని.. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుందనేదే చూస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.
ఇవి కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..