రాజకీయ లబ్ధికోసమే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు హయంలోనే దళితులు ఉచకోతకు గురయ్యారని మంత్రి గుర్తు చేశారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ హేళనగా మాట్లాడిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదే అని అన్నారు. అంతేకాదు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా చంద్రబాబు చిత్రహింసలకు గురి చేశారని మంత్రి విమర్శించారు. ఈ రోజు చంద్రబాబుకు అన్నీ వర్గాలు దూరమయ్యాయన్నారు.
ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని శాడిస్టు అంటూ లోకేష్ విమర్శిస్తున్నారు.. తన కొడుక్కి చంద్రబాబు నేర్పిన సంస్కారం, మర్యాదా ఇదేనా? మంత్రి ప్రశ్నించారు. ఇకపై సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసేప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని మండిపడ్డారు. తండ్రికొడుకులిద్దరు ప్రభుత్వంపై కుట్రలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు.
ఇక మంత్రి అవంతి శ్రీనివాస్‌తోపాటు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ కూడా విమర్శలు గుప్పించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు లోకేష్ రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు.
Home Loans EMI: హోంలోన్ EMIలను చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా..! అయితే వీటిని ఇలా చేయండి..!