టీడీపీ, కాంగ్రెస్, జనసేనలకు బీజేపీ భారీ షాక్..!

తెలుగు రాష్ట్రాలపై కమల దళం మళ్లీ ఫోకస్ పెట్టింది. ఇంటర్వెల్ తీసుకున్నట్లు కొద్ది రోజులు వలసలను ఆపినట్లే ఆపి.. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలు కమలం గూటికి చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరిన నేతలు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలతో పాటు […]

టీడీపీ, కాంగ్రెస్, జనసేనలకు బీజేపీ భారీ షాక్..!

Edited By:

Updated on: Oct 03, 2019 | 1:33 PM

తెలుగు రాష్ట్రాలపై కమల దళం మళ్లీ ఫోకస్ పెట్టింది. ఇంటర్వెల్ తీసుకున్నట్లు కొద్ది రోజులు వలసలను ఆపినట్లే ఆపి.. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలు కమలం గూటికి చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరిన నేతలు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిలతో పాటు మరో టీడీపీ నేతలు తోట నాగేష్‌, గట్టి చిన్న సత్యనారాయణ చేరగా.. జనసేన పార్టీ నుంచి చింతల పార్థసారథి, కాంగ్రెస్ నుంచి బొబ్బిలి శ్రీనివాస రావు చేరారు. అంతేకాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి నక్కా బాలయోగి, రామిని ఫౌండేషన్ అధినేత రామినేని ధర్మ ప్రచారం, పూతలపట్టు రవిలు చేరారు.