Navjot Singh Sidhu: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. సద్వినియోగం చేసుకుందాం.. అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌

|

Oct 17, 2021 | 2:27 PM

ఇదే లాస్ట్‌ ఛాన్స్‌..ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి..అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. పంజాబ్‌లో..

Navjot Singh Sidhu: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌.. సద్వినియోగం చేసుకుందాం.. అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌
Navjot Singh Sidhu
Follow us on

ఇదే లాస్ట్‌ ఛాన్స్‌..ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.. అంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. పంజాబ్‌లో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 13 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించారు. సాగు చట్టాలు, డ్రగ్స్‌ మాఫియా, కరెంట్‌ కష్టాలు, శాండ్‌ మాఫియా, మహిళా సాధికారత, సింగిల్‌ విండో సిస్టమ్‌ ఇలా 13 పాయింట్ల అజెండాను అమలుచేయాలంటూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ అంశాలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా వాటిని సరిచేసుకుంటే మంచిదని లేఖలో పేర్కొన్నారు సిద్ధు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య గొడవతో కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తింది. ఇటీవలే అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ తర్వాత చరణ్ జిత్ సింగ్ చన్నీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే సిద్ధూ కూడా పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశారు. ఐతే సీఎం చరణ్‌సింగ్‌తో పాటు రాహుల్‌ను కలిసిన సిద్ధూ..తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు

ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..

Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..