Lakshmi Parvathi: పవన్‌పై లక్ష్మీ పార్వతి ఫైర్.. విష వృక్షం నీడలో ఉన్నారని కామెంట్

|

Sep 29, 2021 | 9:57 AM

రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకగా పవన్ కళ్యాణ్.. ఏపీ సర్కార్‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నారు. జనసేనానిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఏపీ మంత్రులు.

Lakshmi Parvathi: పవన్‌పై లక్ష్మీ పార్వతి ఫైర్.. విష వృక్షం నీడలో ఉన్నారని కామెంట్
Lakshmi Parvathi Slams Pawan
Follow us on

రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుకగా పవన్ కళ్యాణ్.. ఏపీ సర్కార్‌పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నారు. జనసేనానిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు. తాజాగా ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తే తప్ప ముందుకు వెళ్లలేరని చెప్పారు. పది అడుగుల పాదయాత్ర చేసి.. జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్..  జగన్ మాదిరిగా ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ తాను ఏ సిద్దాంతం ఎన్నుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు. కమ్యూనిస్టులు, టీడీపీలతో కలిసి పనిచేసిన వ్యక్తి… టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్‌లైన్ టికెట్ల ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. ఒక నాయకుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్న పవన్.. దొంగ టికెట్ల అమ్మకాలకు మద్దతుగా నిలిస్తే లీడర్ ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. నాయకులు అయిన వాళ్లు మంచి వైపు నిలబడాలని.. జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. జగన్‌కు ప్రజల మద్దతు ఉందని.. ఆయన జోలికి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వరుస విజయాలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు.

 ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు

క్యారెక్టర్ లేని ప‌వ‌న్ కళ్యాణ్ గురించి మాట్లాడ‌టం తన వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మ‌హిళ‌ల‌పై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న జనసేన అధినేత ప‌వ‌న్ త‌న ద్వారా న‌ష్టపోయిన మ‌హిళ‌ల గురించి ముందు మాట్లాడాలన్నారు. ప‌వ‌న్‌కు మ‌న‌స‌నేదేలేదు.. ఆయ‌న మ‌హిళ‌ల‌ను ఏవిధంగా హింసించారో ప్రజ‌లే చూస్తున్నారు. కులాల గురించి మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వాడు ప్రజా నాయ‌కుడు కాకూడ‌ద‌ని రెండు చోట్ల ప్రజ‌లే తిరుస్కరించారు అని నారాయణ స్వామి తిరుపతిలో చెప్పుకొచ్చారు.

Also Read:  నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం

నరమాంస భక్షకులు.. ఈ జంట 30 మందిని ట్రాప్ చేసి.. చంపి తిన్నారు.. దిమ్మతిరిగే నిజాలు