‘ఆంధ్రా ఆక్టోపస్’ జోస్యం ఫలిస్తుందా..?

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి సర్వే ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని ఆయన శనివారమే వివరించగా.. ఇవాళ సాయంత్రం రానున్న ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఓ హింట్ ఇచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతాడంటూ ఆయన వివరణ ఇచ్చారు. కాగా […]

‘ఆంధ్రా ఆక్టోపస్’ జోస్యం ఫలిస్తుందా..?

Edited By:

Updated on: May 19, 2019 | 9:45 AM

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి సర్వే ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని ఆయన శనివారమే వివరించగా.. ఇవాళ సాయంత్రం రానున్న ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఓ హింట్ ఇచ్చారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగుపెడతాడంటూ ఆయన వివరణ ఇచ్చారు.

కాగా గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో లగడపాటి సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పినప్పటికీ.. ఇక్కడి ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌నే గెలిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఆయన సర్వే ఫలితాలపై కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే తెలంగాణలో తన సర్వే ఫలితాలు ఎందుకు విఫలమయ్యాయన్న విషయంపై కూడా తాను ఇవాళ వివరణ ఇస్తానని లగడపాటి తెలిపారు.