L Ramana: కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నాను.. ఆ తర్వాతే పార్టీ మార్పుపై ప్రకటన చేస్తా..

|

Jun 14, 2021 | 2:54 PM

పదవుల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని తెలంగాణ TDP  రాష్ట్ర అధ్యక్షుడు L.రమణ అన్నారు. ఇప్పుడు తాను పదవుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని.. వాటిని ఖండిస్తున్నట్లు...

L Ramana: కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నాను.. ఆ తర్వాతే పార్టీ మార్పుపై ప్రకటన చేస్తా..
L Ramana
Follow us on

పదవుల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని తెలంగాణ TDP  రాష్ట్ర అధ్యక్షుడు L.రమణ అన్నారు. ఇప్పుడు తాను పదవుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని.. వాటిని ఖండిస్తున్నట్లు రమణ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. పార్టీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటాయని.. ఈ నేపథ్యంలో TRS, BJPలు తనను ఆహ్వానించాయని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. బలహీనవర్గాల బిడ్డగా ముందునుంచి TDP అభివృద్ధికి కృషి చేశానన్నారు. NTR, చంద్రబాబు తనను ప్రోత్సహించారని చెప్పారు. TDP ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని.. MPగానూ అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో TDP గౌరవం పెరిగేలా సిద్ధాంతాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశామన్నారు.

TRS, BJPలు తనకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. తాను కూడా వారికి ఏమీ చెప్పలేదన్నారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ ఆ క్రమంలో ఇచ్చే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ముందుకెళ్తుంటానని తెలిపారు.

ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లే విధంగా మంచి నిర్ణయంతో రావాలని పలువురు కోరుతున్నారన్నారు. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నానని.. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రమణ చెప్పారు.

ఇవి కూడా చదవండి : Funny Viral Video: వధువుకు కోపమొచ్చింది.. పెళ్లి పందిరిలోనే అలా చేసింది.. వచ్చినవారంతా షాక్..

Etela Rajender Joins BJP: బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌… ఆయనతోపాటు మరికొందరు నేతలు