
తెలంగాణకు కేసీఆర్ ఉన్నట్లే.. దేశానికి కూడా ప్రస్తుతం కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు కావాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్బీ నగర్‌లో ‘మన హైదరాబాద్- మన అందరి’ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఎల్బీ నగర్, షామీర్ పేట, రావిర్యాల ప్రాంతాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. భాగ్యనగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 150సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు.