విజయవాడ సెంట్రల్ బరిలో టీఆర్‌ఎస్?

|

Mar 12, 2019 | 11:15 AM

విజయవాడ: ఏపీ ఎలక్షన్స్‌లో టీఆర్‌ఎస్ జెండా కనిపించబోతుందా? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ అంటున్నారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన […]

విజయవాడ సెంట్రల్ బరిలో టీఆర్‌ఎస్?
Follow us on

విజయవాడ: ఏపీ ఎలక్షన్స్‌లో టీఆర్‌ఎస్ జెండా కనిపించబోతుందా? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ అంటున్నారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని చెప్పారు. కాగా ఈ రోజే ఆదినారాయణ కేటీఆర్‌ని కలువనున్నారు. అన్ని అనుకన్నట్లు జరిగితే ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తానూ కేసీఆర్‌ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ చెబుతున్నారు.