గురువారమే బలపరీక్ష
కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకు అధికార పక్షానికి సమయం ఇచ్చిన స్పీకర్ రమేష్ కుమార్.. ఈ నెల 18న విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే స్వయంగా కుమారస్వామినే బలపరీక్షకు సిద్ధమవ్వడంతో ఇవాళే విశ్వాసపరీక్ష పెట్టాలని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం నుంచి తీర్పు వెలువడనుందని.. ఆ తరువాత విశ్వాసపరీక్ష నిర్వహిస్తామని […]
కర్ణాటక రాజకీయ సంక్షోభం ముదిరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఇందుకు అధికార పక్షానికి సమయం ఇచ్చిన స్పీకర్ రమేష్ కుమార్.. ఈ నెల 18న విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అయితే స్వయంగా కుమారస్వామినే బలపరీక్షకు సిద్ధమవ్వడంతో ఇవాళే విశ్వాసపరీక్ష పెట్టాలని బీజేపీ పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం నుంచి తీర్పు వెలువడనుందని.. ఆ తరువాత విశ్వాసపరీక్ష నిర్వహిస్తామని రమేష్ వెల్లడించారు. కాగా ఈ విషయంపై సభలో గందరగోళ పరిస్థితి నెలకడంతో స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.
అయితే కర్ణాటకలో మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించాలని సుప్రీం తీర్పునిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు అవుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 105 అవుతుంది. ప్రస్తుతం శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 107(ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి)గా ఉంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం101(స్పీకర్‌తో కలిపి)గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో విశ్వాస పరీక్ష జరిగితే కుమారస్వామి గెలుపు అసాధ్యంగానే కనిపిస్తోంది.