చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ తోడు దొంగలు

లక్షల కోట్లు అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు, జగన్ ఇద్దరూ తోడు దొంగలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అభివర్ణించారు. ప్రజాశాంతి తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని కేఏ పాల్ అన్నారు. శుక్రవారం పాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీకి చెందిన వారు తమ సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారని అన్నారు. టీడీపీ 38మంది […]

చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ తోడు దొంగలు
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 8:01 AM

లక్షల కోట్లు అవినీతి చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న చంద్రబాబు, జగన్ ఇద్దరూ తోడు దొంగలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అభివర్ణించారు. ప్రజాశాంతి తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో చాలా మంది తమ అభ్యర్థులు కారని కేఏ పాల్ అన్నారు. శుక్రవారం పాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.

అనంతరం మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీకి చెందిన వారు తమ సిబ్బందిపై దాడిచేసి ప్రజాశాంతి బీఫారాలు ఎత్తుకెళ్లి అభ్యర్థులను నిలిపారని అన్నారు. టీడీపీ 38మంది అభ్యర్థులను, వైసీపీ 11మంది అభ్యర్థులను నిలిపిందని ఆయన ఆరోపించారు. అలాగే పలుచోట్ల ప్రజాశాంతి అభ్యర్థుల బీఫారాలు తిరస్కరించిన అధికారులు.. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు అనుమతించారని పాల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన తమ పార్టీకి నష్టం జరిగిందని, ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరానని ఆయన చెప్పారు.