సెంటర్‌లో తారక రాముడు.. ఓవైపు సినిమా.. మరోవైపు రాజకీయం.. చిన్నోడి పయనం ఎలా సాగేను!

|

Mar 22, 2021 | 5:09 PM

రావాలి.. ఆయన రావాలి. ఆయన యాక్టీవ్ రాజకీయాల్లోకి రాణించాలి. అవును ఆయన కోసం ఫ్యాన్స్ డిమాండ్. సందర్భం దొరికినప్పుడుల్లా..

సెంటర్‌లో తారక రాముడు.. ఓవైపు సినిమా.. మరోవైపు రాజకీయం.. చిన్నోడి పయనం  ఎలా సాగేను!
Follow us on

Jr NTR into politics: రావాలి.. ఆయన రావాలి. ఆయన యాక్టీవ్ రాజకీయాల్లోకి రాణించాలి. అవును ఆయన కోసం ఫ్యాన్స్ డిమాండ్. సందర్భం దొరికినప్పుడుల్లా.. తమ ఆకాంక్షను వెళ్లగక్కుతున్నారు. ప్రచారం మొదలు.. సినిమా ఫంక్షన్ వరకు ఎక్కడైనా.. ఇదే గళం.. ఇదే స్వరం.

మొన్నటికి మొన్న చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన రావలంటూ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఈ మధ్య బాగా వినిపిస్తోంది. టీడీపీ అధినేత ముందే పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్‌ను తీసుకురావాలని కేకలు వేశారు. మొన్నటికి మొన్న ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. ఇది సమయం కాదు.. సందర్భం కాదంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌. తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లోను అవే స్లోగన్స్‌ వినిపించాయి. తన ప్రసంగానికి అంతరాయం కలగడంతో.. ఆగండి బ్రదర్‌ అంటూ అభిమానులకు సర్దిచెప్పారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌ సీఎం స్లోగన్‌ ఇంతటితో ఆగుతుందా.. ఈ ట్రెండ్‌ కంటిన్యూ అవుతుందా అన్న చర్చ మొదలైంది. అది రాజకీయమైనా.. సినీ పరిశ్రమ అయినా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ బలంగా కోరుతున్నారు. దీనిపై ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారే తప్పా.. ఆయన మనస్సులో ఏముందో మాత్రం చెప్పడం లేదు. కొందరి టీడీపీ కార్యకర్తల మనసులో తారక్ పార్టీని టేకోవర్ చేసుకోవాలన్న తపన బలంగా కనిపిస్తుంది. నటుడిగా తారక్‌ను అభిమానిస్తున్నవారు మాత్రం టాప్ హీరోగా కొనసాగుతున్న ఈ సమయంలో రిస్క్ వద్దని మరికొంతకాలం నటుడిగా కొనసాగలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి అసలు తారక్ మనసులో ఏముందో తేలిపోతుంది.

Also Read: 74-year-old Canadian Grandma: ఆమె వయస్సు 74 సంవత్సరాలు.. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్మగలరా…?