హల్వా ఇచ్చి ‘అమ్మ’ను చంపారు

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపారని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. జయలలితను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అమ్మను చూసేందుకు ప్రయత్నించామని, అయితే సాధ్యపడలేదని తెలిపారు. తరువాత కూడా తమను శశికళ అనుమతించలేదని ఆరోపించారు. జయలలితకు మధుమేహం ఉన్నట్లు తెలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు హల్వా ఇచ్చారని, వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారంటూ ఆరోపించారు. బాగా కోలుకుంటున్న ఒకరికి కార్డియాక్ అరెస్ట్ ఎలా రాగలదని..? […]

హల్వా ఇచ్చి ‘అమ్మ’ను చంపారు

Edited By:

Updated on: Mar 07, 2019 | 10:28 AM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపారని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం ఆరోపించారు. జయలలితను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అమ్మను చూసేందుకు ప్రయత్నించామని, అయితే సాధ్యపడలేదని తెలిపారు. తరువాత కూడా తమను శశికళ అనుమతించలేదని ఆరోపించారు. జయలలితకు మధుమేహం ఉన్నట్లు తెలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు హల్వా ఇచ్చారని, వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారంటూ ఆరోపించారు. బాగా కోలుకుంటున్న ఒకరికి కార్డియాక్ అరెస్ట్ ఎలా రాగలదని..? కార్డియాక్ అరెస్ట్ వస్తే ఆసుపత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని..? ఆయన ప్రశ్నించారు. విచారించాల్సిన విధంగా శశికళను విచారిస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.