జనసేనదే అధికారం: జేడీ లక్ష్మీ నారాయణ

విజయవాడ: ప్రజల్లో జనసేన నిశ్శబ్ద విప్లవంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్ధి జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి 85 నుంచి 125 వరకు సీట్లు వస్తాయని తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తున్న విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. నగర ప్రజలు ముఖ్యంగా తీవ్ర నీటి […]

జనసేనదే అధికారం: జేడీ లక్ష్మీ నారాయణ

Edited By:

Updated on: Apr 02, 2019 | 2:19 PM

విజయవాడ: ప్రజల్లో జనసేన నిశ్శబ్ద విప్లవంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్ధి జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి 85 నుంచి 125 వరకు సీట్లు వస్తాయని తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తాను పోటీ చేస్తున్న విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. నగర ప్రజలు ముఖ్యంగా తీవ్ర నీటి సమస్యతో బాధపడుతున్నారని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి సమస్యతో పాటు వైద్య సేవలు పెరగాల్సిన అవసరం ఉంది.  రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పు జనసేనతో రావాలని ఆశిస్తున్నారని జెడీ లక్ష్మీనారాయణ చెప్పారు.