
Janasena: ఏపీలో పొత్తుల గురించి ప్రధాన పార్టీల నేతల మధ్య డైలాగులు పేలుతున్న వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు చర్చయనీయాంశమయ్యాయి. జనసేన కారకర్తలను ఉద్దేశించి.. వారిని అలెర్ట్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది.
“జర భద్రం ————— అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి” అని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
(Cont..)అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022