CPI నేత నారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పవన్(Pawan kalyan) తీరుపై విరుచుకుపడ్డారు. ఆవిర్భావ సభలో పవన్ అటు ఇటు కాకుండా తలతిక్కగా మాట్లాడారంటూ విమర్శించారు. రాజకీయంగా కన్ఫ్యూజన్‌లో ఉన్న పవన్…. క్యాడర్‌ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని సెటైర్లు వేశారు.. సీపీఐ సీనియర్ నేత నారాయణ వ్యాఖ్యలపై జనసేన పోతిన మహేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఉచిత సలహాలు ఇవ్వద్దని సూచించారు. ప్రజాసమస్యలపై ఎలా పోరాడాలో ఒకరు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో పవన్ లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 27 శాతం ఓటు బ్యాంకుతో జనసేన బలంగా దూసుకెళ్తుందని చెప్పారు. రాష్ట్ర రాజకీయలను శాసించే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. బీజేపీని రోడ్ మ్యాప్ అడగడంపై కొందరు రకరకాల కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సీపీఐ జాతీయ స్థాయిలో గుర్తింపు కోల్పోతుందని… నారాయణ, రామకృష్ణ లాంటి నేతలు దానిపై దృష్టి పెట్టాలని చురకలంటించారు పోతిన మహేశ్. ఏపీలో సీపీఐకు ఉన్న ఓటు బ్యాంకు ఎంతో అందరికీ తెలుసన్నారు.