టీవీ9 తో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం ఎక్కడినుండైనా రాష్ట్రాన్ని పాలించవచ్చని, రాజధాని ఎక్కడికీ వెల్లదని పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణలో జనసేన కి ఛాన్స్ అనే వార్తలు తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. పదవులు కోసం జనసేన ఎప్పుడూ పాకులాడదని, జనసేన నిర్మాణాత్మకమైన రాజకీయం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరిగేషన్ వివాదాలు అనేవి నిజాయితీగా వచ్చాయా, రాజకీయ కారణాల వల్ల వచ్చాయా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ఇద్దరు సీఎంలు మధ్య సఖ్యత ఉందని.. సమస్యలు పరిష్కరించుకుంటాం అన్నారు.. ఇప్పుడెందుకు అలా చెయ్యడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల సీఎంల పోరాటాలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
మరోవైపు రేపు ఏళ్ళుండి జనసేన మంగళగిరి రాష్ట్ర కార్యాలయం సందడిగా మారనుంది.కోవిడ్ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రాకతో వివిధ సమస్యలపై చర్చ చేపట్టి భవిషత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ పర్యటన నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించిన పలువురు నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయి చర్చించారు. ప్రధానంగా నిరుద్యోగ క్యాలెండర్, ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై పీఏసీ లో చర్చించినట్లు నాదెండల్ మనోహర్ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ దూకుడు పెంచడంతో కార్యకర్తలు మంచి జోష్ లో ఉన్నారు.
Also Read: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోంది : జగ్గారెడ్డి