కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి.. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత హరీష్ రావుకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను సమర్థిస్తున్నానన్నారు. కానీ.. 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను మాత్రం నేను ఖండిస్తున్నా అని అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 70 డ్యాంలు నిర్మించిన ఘనత ఆ పార్టీకే దక్కుందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టునే కేసీఆర్ ఇంకొకచోట పెట్టి కాళేశ్వరం అని పేరు పెట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్యాంలు కట్టిందో.. మీరు ఎన్ని డ్యాంలు కట్టారో బహిరంగ చర్చకు సిద్ధామా అని హరిష్ రావుకు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. మరి హరీష్ రావు ఈ సవాల్‌ని స్వీకరిస్తారో లేదా తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.