100% మ్యాచ్ ఫిక్సింగే: విజయసాయి ట్వీట్
వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేసారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే ఈ నలుగుర్నీ బీజేపీకి పంపించారని ఆరోపించారు. మోదీ గూటికి చేరిన నలుగురు ఎంపీలు చంద్రబాబు బినామీలేనన్నారు. వీరంతా పార్టీ మారినట్టు బాబుకు […]
వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ విమర్శలు చేసారు.
ట్విట్టర్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే ఈ నలుగుర్నీ బీజేపీకి పంపించారని ఆరోపించారు. మోదీ గూటికి చేరిన నలుగురు ఎంపీలు చంద్రబాబు బినామీలేనన్నారు.
వీరంతా పార్టీ మారినట్టు బాబుకు తెలియకపోతే వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాసి ఉండేవారని విమర్శించారు. నలుగురు పార్టీ మారడం నూటికి నూరుశాతం మ్యాచ్ ఫిక్సింగే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.
నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసింది. రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుంది. బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయి ఇక నుంచి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 22, 2019
బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారు. తనకు తెలియకుండానే జరిగితే ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ అయినా రాసి ఉండేవారు. ఇది 100% మ్యాచ్ ఫిక్సింగే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 22, 2019