ఎవరికీ భయపడే పరిస్థితి లేదు: వైఎస్ విజయమ్మ

విజయవాడ: ఈ రోజు ఎవరికీ లొంగే పరిస్థితి, ఎవరికీ భయపడే పరిస్థితి లేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నో కేసులు పెట్టారు, జైల్లో పెట్టించారు, ఆస్తులను అటాచ్ చేశారు.. అప్పుడే జగన్ ఎవరికీ భయపడలేదని ఆమె అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కలిసి జగన్‌పై ఎన్నో కేసులు పెట్టారు. జగన్‌కు ప్రజల అభివృద్ధే కావాలి, రాష్ట్రానికి మంచి చేయాలనే నా కుమారుడు నిలబడ్డాడు అని ఆమె […]

ఎవరికీ భయపడే పరిస్థితి లేదు: వైఎస్ విజయమ్మ

Edited By:

Updated on: Apr 02, 2019 | 2:20 PM

విజయవాడ: ఈ రోజు ఎవరికీ లొంగే పరిస్థితి, ఎవరికీ భయపడే పరిస్థితి లేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నో కేసులు పెట్టారు, జైల్లో పెట్టించారు, ఆస్తులను అటాచ్ చేశారు.. అప్పుడే జగన్ ఎవరికీ భయపడలేదని ఆమె అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ కలిసి జగన్‌పై ఎన్నో కేసులు పెట్టారు. జగన్‌కు ప్రజల అభివృద్ధే కావాలి, రాష్ట్రానికి మంచి చేయాలనే నా కుమారుడు నిలబడ్డాడు అని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, జగన్‌కు అఖండ విజయాన్ని అందించాలని ప్రజలను విజయమ్మ కోరారు.