జగన్ భల్లాలదేవుడు, మోడీ బిజ్జలదేవుడు: చంద్రబాబు

చిత్తూరు: ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. జగన్‌ను భల్లాలదేవుడితో, మోడీని బిజ్జలదేవుడితో పోల్చారు. ఎన్నికల ప్రచారంలో తనను మోడీ భల్లాలదేవుడితో పోల్చినందుకు కౌంటర్‌గానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బాహుబలి సినిమాను చంద్రబాబు ప్రస్తావించడం ఇది రెండోసారి. అంతకుముందు కేసీఆర్‌ను విమర్శిస్తూ నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలి అని అన్నారు. ఆంధ్రప్రజలు బాహుబలి అని, […]

జగన్ భల్లాలదేవుడు, మోడీ బిజ్జలదేవుడు: చంద్రబాబు

Updated on: Apr 02, 2019 | 11:56 AM

చిత్తూరు: ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. జగన్‌ను భల్లాలదేవుడితో, మోడీని బిజ్జలదేవుడితో పోల్చారు. ఎన్నికల ప్రచారంలో తనను మోడీ భల్లాలదేవుడితో పోల్చినందుకు కౌంటర్‌గానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బాహుబలి సినిమాను చంద్రబాబు ప్రస్తావించడం ఇది రెండోసారి. అంతకుముందు కేసీఆర్‌ను విమర్శిస్తూ నువ్వు బాహుబలి అయితే నేను మహా బాహుబలి అని అన్నారు.

ఆంధ్రప్రజలు బాహుబలి అని, జగన్ భల్లాలదేవుడు అని, మోడీ బిజ్జలదేవుడు అంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల యుద్ధంలో 25కి 25 సీట్లు గెలిచి చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు.

రాష్ట్ర విభజన అనంతరం డబ్బుల్లేకపోయినా ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నామంటే అది తన పాలన కారణంగానే అని చంద్రబాబు చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రతి ఊళ్లో దళారీ వ్యవస్థ తీసుకువస్తాడని ఆరోపించారు. జగన్ కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్ అని, జగన్ గెలిస్తే అది నేరస్తుల గెలుపు అవుతుందని, అంతిమంగా అది కేసీఆర్ గెలుపు అవుతుందని చంద్రబాబు అన్నారు.