కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యల వెనక.. టార్గెట్ ఆయనేనా..?

తెలంగాణ జెండాకు ఓనర్లము తామే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అవును ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో ఈటెల మంత్రి పదవి కోల్పోబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల మధ్యలో దూరం కూడా పెరిగిందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలపై.. అంతా […]

కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యల వెనక.. టార్గెట్ ఆయనేనా..?
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 4:01 PM

తెలంగాణ జెండాకు ఓనర్లము తామే.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో అర్థమయ్యే ఉంటుంది. అవును ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో ఈటెల మంత్రి పదవి కోల్పోబోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల మధ్యలో దూరం కూడా పెరిగిందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలపై.. అంతా సైలెంట్‌గా ఉన్నా.. ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ జెండాకు ఓనర్ కేసీఆర్ అంటూ ఎర్రబెల్లి కామెంట్ చేయడంతో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా మొన్న తెలంగాణ భవన్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కమిటీల నియామకంపై హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో అలజడిని సృష్టించాయి. సమావేశంలో భాగంగా..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొంతమంది నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ చూస్తుంటే.. ఈటెలతో వార్‌ను ఓపెన్‌గా డిక్లేర్ చేసినట్లేనన్న మాట కూడా వినిపిస్తోంది.

అంతే కాదు మొన్న ఎర్రబెల్లి నోటి నుంచి వచ్చిన రియాక్షన్ వెనుక కేటీఆర్ ఉన్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అధిష్టానం అనుమతితోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని.. విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం టార్గెట్ మంత్రి ఈటెల అన్నట్లు తెలుస్తోంది. మరి కేబినెట్ విస్తరణ జరిగితే.. అప్పుడు ఎవరు ఏంటి అన్న విషయం తెలుస్తుంది.

ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే