ఇండియాలో రైతుల ఆందోళనపై బ్రిటిష్ ఎంపీలు పలువురు సోమవారం సాయంత్రం చర్చించారు. తమ దేశ పార్లమెంట్ ఆవరణలో సమావేశమైన వీరు.. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. లక్షకు పైగా సంతకాలతో కూడిన ఓ పిటిషన్ ను రూపొందించిన నేపథ్యంలో వారి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతుల ఆందోళన గర్హనీయమని, భారత ప్రభుత్వం, రైతు సంఘాలు కూడ ఓ ఒప్పందానికి వచ్ఛేలా కౌన్సెలింగ్ వంటిది అవసరమని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. ప్రజాస్వామ్య శక్తిని భారత ప్రభుత్వం గుర్తించాలని లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ లేలా మొరన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలు క్లిష్టమైన సమస్యగా మారాయని థెరెసా విలీర్స్ అనే మరో ఎంపీ వ్యాఖ్యానించారు. ఇలా భారత దేశంలో రైతుల ఆందోళనపై తలకో రకంగా వ్యాఖ్యానించారు. అయితే ఇది మా ఆంతరంగిక వ్యవహారమని ఇండియా ఖండించింది. వాస్తవ దూరమైన అంశాలపై ఈ చర్చ జరగడం విచారకరమని లండన్ లోని భారత హైకమిషన్ పేర్కొంది. గతంలో కూడా ఢిల్లీ శివార్లలో జరుగుతున్న అన్నదాతల నిరసనలపై బ్రిటిష్ ఎంపీలు చర్చించారని, మళ్ళీ ఈ విధమైన డిబేట్ లు జరగడం ఖండించదగినదని నిరసన వ్యక్తం చేసింది.
మరోవైపు వ్యవసాయ చట్టాలు ఇండియాకు సంబంధించి ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమని కామన్ వెల్త్ డెవలప్ మెంట్ ఆఫీస్ మినిష్టర్ నీజిల్ ఆడమ్స్ కూడా వ్యాఖ్యానించారు. భారత- బ్రిటన్ సంబంధాల నేపథ్యంలో ఈ విధమైన చర్చలు జరపడంలో సహేతుకతను ఎంపీలే అర్థం చేసుకోవాలని అన్నారు. నిజానికి దేశంలో కోవిడ్ వంటి పలు సమస్యలు ఉన్నాయని, ఈ వైరస్ నివారణకు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్ఛే బదులు మరో దేశంలోని ఆంతరంగిక సమస్యపై చర్చించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. లోగడ కూడా పలువురు ఎంపీలు ఇలాగే భారత్ లో రైతుల ఆందోళనపై చర్చించడంతో ఆ దేశం ప్రొటెస్ట్ చేసిన విషయాన్నీ విస్మరించరాదన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Prema Entha Madhuram Serial: “ప్రేమ ఎంత మధురం” సీరియల్ ఫేం అను గురించి ఆసక్తికర విషయాలు..