Eluru Corporation Results: ఏలూరులో తారుమారైన ఫలితాలు.. వైసీపీ ప్రభంజనం.. మారిపోయిన టీడీపీ లెక్క..

|

Jul 26, 2021 | 2:17 PM

Eluru Municipal Corporation Election Results: ఓడలు బండ్లు. బండ్లు ఓడలు అవుతాయంటారు పెద్దలు. యాదృచ్చికమో, ప్రజల తీర్పో ఏమో కానీ ఏలూరు కార్పొరేషన్‌లో అచ్చం అలాగే జరిగింది. గతంలో వైసీపీకి మిగిలింది ముగ్గురు. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచింది...

Eluru Corporation Results: ఏలూరులో తారుమారైన ఫలితాలు..  వైసీపీ ప్రభంజనం.. మారిపోయిన టీడీపీ లెక్క..
Eluru Municipal Corporation
Follow us on

టైం మారిందేమో కానీ టైమింగ్ మాత్రం మారలే. అదే రీసౌండ్.. అదే రిజల్ట్. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సందర్భంగా వైసీపీ శ్రేణుల మాటలివి. అక్కడ ఫ్యాన్‌ హవాకు తిరుగు లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ఇక్కడ ఓడలు బండ్లు. బండ్లు ఓడలు అవుతాయంటారు పెద్దలు. యాదృచ్చికమో, ప్రజల తీర్పో ఏమో కానీ ఏలూరు కార్పొరేషన్‌లో అచ్చం అలాగే జరిగింది. గతంలో వైసీపీకి మిగిలింది ముగ్గురు. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచింది ముగ్గురు. అప్పటికీ ఇప్పటికీ సీన్‌ రివర్స్‌ అయింది.

2019 ఫలితాల కన్నా ఏలూరు కార్పొరేషన్‌లో ఓట్ల శాతాన్ని పెంచుకున్ని తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంది అధికార వైసీపీ. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 43 మంది గెలిచారు. వైసీపీ తరపున ఏడుగురే గెలిచారు. ఆ తర్వాత నలుగురు కార్పొరేటర్లను తన వైపు తిప్పుకుంది టీడీపీ. దాంతో ఆ పార్టీ బలం అప్పట్లో 47కి చేరింది. వైసీపీకి ముగ్గురే మిగిలారు. ఇప్పుడు ఇద్దరి బలం రివర్స్‌ అయింది.

నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ నుంచి 47 మంది గెలిస్తే, టీడీపీ నుంచి కేవలం ముగ్గురే విజయం సాధించారు. జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ పోటీ చేసినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అయితే వైసీపీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరు ఇటీవల అనారోగ్య కారణాలతో చనిపోయారు. దీంతో 45, 46 డివిజన్లలో మళ్లీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి.

ఇక పార్టీల వారీగా చూస్తే 2019 సాధారణ ఎన్నికలకు, ఇప్పటికి వైసీపీ బలం బాగా పెరిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో వైసీపీకి 72 వేల 247 ఓట్లతో 44.73 శాతం పోలయ్యాయి. మొన్న జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 74 వేల 854 ఓట్లు వచ్చాయి. దాదాపు 12 శాతం ఎక్కువగా అధికార పార్టీకి వచ్చాయి. మార్చిలో జరిగిన ఎన్నికల్లో 56 శాతం పోలింగ్‌ జరిగితే, అందులో సగానికిపైగా వైసీపీకే వచ్చాయి. మిగిలిన 44 శాతం ఓట్లను అన్ని పార్టీలు పంచుకోవాల్సిన పరిస్థితి.

ఏలూరులో టీడీపీ బాగా దెబ్బతింది. 14 శాతం ఓట్లను తెలుగుదేశం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 68 వేల 175 ఓట్లతో 42.21 శాతం ఆ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు 37 వేల 414 ఓట్లతో 28.20 శాతానికే పరిమితమైంది. 43 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తే ఓడిపోయిన 44 డివిజన్లలోనూ తక్కువ ఓట్లే వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణంతో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. పైగా మిగిలిన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో అంతోఇంతో ప్రభావం ఉందనుకునే జనసేన ఏలూరు కార్పొరేషన్‌లో పత్తా లేకుండా పోయింది. 20 డివిజన్లలో పోటీ చేసినా ఒక్క డివిజన్‌ కూడా రాలేదు. 2019 ఎన్నికల్లో జనసేనకు 16 వేల 681 ఓట్లతో 10.33 శాతం వచ్చాయి. ఇప్పుడు కేవలం 7 వేల 407 ఓట్లతో 5.58 శాతానికే పరిమితం అయింది. అంటే 4.75 శాతం ఓట్లను ఆ పార్టీ కోల్పోయింది.

బీజేపీ మాత్రం ఏలూరులో కొద్దిగా ఓట్లను పెంచుకోలిగింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 976 ఓట్లే వచ్చాయి. అంటే ఒక్క శాతంలోపే. ఇప్పుడు 2 వేల 853 ఓట్లతో 2.15 శాతానికి ఓట్లను పెంచుకుంది బీజేపీ. అయితే 16 డివిజన్లలో పోటీ చేసినా ఒక్కచోటా ప్రభావం చూపలేకపోయింది. ఇక కాంగ్రెస్‌, వామపక్షాలు ఉన్నా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కనీస ఓట్లను ఆ పార్టీలు సాధించుకోలేకపోయాయి.

Eluru Corporation Election

ఇవి కూడా చదవండి: Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..