కేంద్రానికి మెహబూబా ముఫ్తీ ఘాటు హెచ్చరిక!

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 4:20 PM

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం 370వ అధికరణపై కేంద్రానికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ అధికరణను కేంద్రం రద్దు చేస్తే కశ్మీర్‌తో ఉన్న సంబంధాలకు ఇక చరమగీతం పాడినట్టేనని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కొత్త షరతులు తెరపైకి వస్తాయని ఆమె హెచ్చరించారు. బ్రిడ్జి (ఆర్టికల్ 370)ని తెంచేస్తే…ఇండియా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలపై మీరు కొత్తగా సంప్రదింపులు జరపాల్సి […]

కేంద్రానికి మెహబూబా ముఫ్తీ ఘాటు హెచ్చరిక!
Follow us on

పుల్వామా ఉగ్ర దాడి అనంతరం 370వ అధికరణపై కేంద్రానికి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఘాటు హెచ్చరిక చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఈ అధికరణను కేంద్రం రద్దు చేస్తే కశ్మీర్‌తో ఉన్న సంబంధాలకు ఇక చరమగీతం పాడినట్టేనని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కొత్త షరతులు తెరపైకి వస్తాయని ఆమె హెచ్చరించారు.

బ్రిడ్జి (ఆర్టికల్ 370)ని తెంచేస్తే…ఇండియా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలపై మీరు కొత్తగా సంప్రదింపులు జరపాల్సి వస్తుంది. అప్పుడు కొత్త షరతులు తెరపైకి వస్తాయి. ముస్లిం మెజారిటీ రాష్ట్రం మీతో కలిసి ఉంటుందనుకుంటున్నారా? 370వ అధికరణను మీరు రద్దు చేస్తే జమ్మూకశ్మీర్‌తో మీ సంబంధాలు తెగిపోయినట్టే’ అని మెహబూబా హెచ్చరిక చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35 (ఏ)తో పాటు ఆర్టికల్-370ని రద్దు చేయాలని తరచు డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మెహబూబా తాజా హెచ్చరికలు చేశారు.