నాన్న బీజేపీనే.. కానీ నేను టీడీపీలోనే ఉంటా: టీజీ భరత్

| Edited By:

Jun 22, 2019 | 12:53 PM

తన తండ్రి బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ.. తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫోన్ చేసి చెప్పానని పేర్కొన్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్న భరత్.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రి బీజేపీలోకి చేరేముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పిన భరత్.. తాను ఏ […]

నాన్న బీజేపీనే.. కానీ నేను టీడీపీలోనే ఉంటా: టీజీ భరత్
Follow us on

తన తండ్రి బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ.. తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫోన్ చేసి చెప్పానని పేర్కొన్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్న భరత్.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రి బీజేపీలోకి చేరేముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పిన భరత్.. తాను ఏ పార్టీలో ఉండాలన్న నిర్ణయాన్ని తన తండ్రి తనకే వదిలేశారని వెల్లడించారు. అయితే టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేస్తోన్న టీజీ వెంకటేష్.. గురువారం బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఈ క్రమంలో టీజీ భరత్ కూడా కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వాటిపై స్పందించిన భరత్.. పార్టీ మారనని తెలిపారు.