పెనమలూరు వైసీపీలో వింత పరిస్థితి

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి భార్యా భర్తలు సై అంటూ పోటీకి దిగారు. వైసీపీ తరుపున అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి కమల ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. పార్థసారథికి ఫ్యాన్‌ గుర్తును కేటాయించగా.. కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. వీరి కుమారుడు నితిన్‌ కృష్ణ దాఖలు చేసిన నామినేషన్‌ను పరిశీలనలో తొలగించారు. అయితే ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో […]

పెనమలూరు వైసీపీలో వింత పరిస్థితి

Updated on: Mar 29, 2019 | 7:44 PM

పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి భార్యా భర్తలు సై అంటూ పోటీకి దిగారు. వైసీపీ తరుపున అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి కమల ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.

పార్థసారథికి ఫ్యాన్‌ గుర్తును కేటాయించగా.. కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. వీరి కుమారుడు నితిన్‌ కృష్ణ దాఖలు చేసిన నామినేషన్‌ను పరిశీలనలో తొలగించారు. అయితే ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా తెదేపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ బరిలో ఉన్నారు.