ఎప్పుడో ఓటరుగా నమోదై ఉంటారు. మరి మీ ఓటు హక్కు అసలు ఉందా? ఏదైనా కారణాల వల్ల తొలగించారా..? మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది..? ఓటును చెక్ చేసుకోవడం ఎలా..? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఎప్పుడో ఓటరుగా నమోదై ఉన్నా తమ ఓటు ఉందా లేక ఏదైనా కారణాల వల్ల తొలగించారా వంటి విషయాల్లో ఓటర్లు తీవ్ర గందర గోళానికి గురవుతున్నారు. అయితే ఓటు ఉందో, లేదో తెలుసుకునే పలు పద్ధతులను ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి మీ వివరాలను చెప్పటం ద్వారా మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
ఇక నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు EPIC నంబరు కానీ నమోదు చేస్తే ఓటుందో లేదో తెలుస్తుంది. ఒక వేళ ఓటు లేకపోతే అందులో నమోదు చేసుకోవచ్చు. సెర్చ్ యువర్ నేమ్ ఆప్షన్‌లోకి వెళ్ళి మీ పేరును, ఓటరు ఐడీ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. మొత్తానికి భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఓటును చెక్ చేసుకొని ఓటు తొలిగింపు జరిగి ఉంటే. తిరిగి నమోదు చేసుకునే అవకాశం నామినేషన్ల వరకు కలిపించారు.