‘ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటా’.. హిందూపురంలో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో...

ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటా..  హిందూపురంలో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్

Updated on: Feb 16, 2021 | 8:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా బెదిరింపులకు పాల్పడుతోందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అలజడులు రేపుతూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. కొన్ని కుటుంబాల వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు.

మైండ్‌గేమ్‌ రాజకీయాలు చేస్తున్నారని.. అడిగే వారు లేరని అధికార పార్టీ వారు బరి తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని ఎవరిపై అయితే నమ్మకం ఉంటుందో ప్రజలు వారికే ఓటు వేస్తారన్నారు. కాదని బెదిరింపులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ వైసీపీ బెదిరింపులకు తలొగ్గద్దని.. తన ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటానని చెప్పారు. తమను బెదిరించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు బాలయ్య.

Also Read:

Date Extended: విద్యార్థులూ బీ అలర్ట్.. ఉపకార వేతనాల దరఖాస్తుకు గడువు పెంచిన ప్రభుత్వం.. చివరి తేదీ ఎప్పుడంటే..

Today Petrol and Diesel Price: మళ్లీ బాదేశారు.. వరుసగా ఎనిమిదవ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే..