Chalo Indravelli: ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్‌ పోరాటం.. ఇంద్రవెల్లిలో హై టెన్షన్‌..

|

Aug 09, 2021 | 9:36 AM

ఇంద్రవెల్లి సాక్షిగా పోరాటాలకు సన్నద్దమవుతోంది కాంగ్రెస్‌. ఇవాళ చలో ఇంద్రవెల్లికి పిలుపునివ్వడంతో హై టెన్షన్‌ నెలకొంది. వివిధ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డ నుంచే.. దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరాను...

Chalo Indravelli: ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్‌ పోరాటం.. ఇంద్రవెల్లిలో హై టెన్షన్‌..
Ts Cong
Follow us on

ఇంద్రవెల్లి సాక్షిగా పోరాటాలకు సన్నద్దమవుతోంది కాంగ్రెస్‌. ఇవాళ చలో ఇంద్రవెల్లికి పిలుపునివ్వడంతో హై టెన్షన్‌ నెలకొంది. వివిధ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డ నుంచే.. దళిత, గిరిజన, ఆత్మగౌరవ దండోరాను మోగించబోతోంది. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది కాంగ్రెస్‌. కొన్నిరోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మకాం వేసిన కాంగ్రెస్‌ నేతలు.. ఈ మేరకు సన్నాహక సమావేశాలను కూడా పెట్టుకున్నారు. సభను విజయవంతం చేయాలని చూస్తున్నారు. గిరిజనులు, దళితులను పెద్దసంఖ్యలో మొహరించేపనిలో పడ్డారు.

ఎస్సీలకు ప్రభుత్వం ప్రకటించిన 10లక్షల ఆర్ధిక సాయంతో పాటు పోడుభూముల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీలకు అందజేయాలనుకుంటున్న ఆర్ధిక సాయాన్ని.. రాష్ట్ర మంతటా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సభ ద్వారా ఆదివాసీలకు అండగా ఉంటామని చెప్పుకునే యత్నం చేస్తున్న కాంగ్రెస్‌నేతలు.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అంటున్నారు.

అయితే కాంగ్రెస్‌ నేతల మాటలను తుడుందెబ్బ వంటి ఆదివాసీ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇంద్రవెల్లిలోనే 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ మిగిల్చిన నెత్తుటి మరకలను మరిచిపోలేదని చెబుతున్నారు. ఆదివాసీల గుండెల్లో తూటాలను దించిన కాంగ్రెస్‌ కుట్రలను నమ్మమని అంటున్నారు. రాజకీయ లబ్దికోసం తమ అస్తిత్వాన్ని వాడుకోవాలని చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇస్తున్నారు.

దళిత, గిరిజనులకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ చెప్పుకునే యత్నం చేస్తుండగా… ఆదివాసీ సంఘాలు మాత్రం ఇంద్రవెల్లిలో సభ నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో హై టెన్షన్‌ నెలకొంది.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..