ఏపీలో ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్..

ఏపీ ఎన్నికల్లో ఈసారి ఎన్నడూలేనంత హింస చెలరేగింది. ప్రశాంతంగా జరిగే ఏరియాల్లో కూడా గ్రూప్ ఫైట్స్ తారాస్థాయికి చేరాయి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీల నేతలు రోడ్లమీదకు వచ్చి తన్నుకున్నారు. రక్తాలు కారేట్టుగా.. కర్రలతో బాదుకున్నారు. ప్రధాన పార్టీల మధ్య మాటలు కాస్తా చేతలు దాకా వెళ్లాయి. ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాయి. అర్థరాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేశాయి. రాత్రి సమయంలో కూడా పోలింగ్ సమస్యతో రోడ్లపై బైఠాయింపులు, ధర్నాలు జరిగాయి. […]

ఏపీలో ఉద్రిక్తతల మధ్య ముగిసిన పోలింగ్..

Edited By:

Updated on: Apr 12, 2019 | 10:30 AM

ఏపీ ఎన్నికల్లో ఈసారి ఎన్నడూలేనంత హింస చెలరేగింది. ప్రశాంతంగా జరిగే ఏరియాల్లో కూడా గ్రూప్ ఫైట్స్ తారాస్థాయికి చేరాయి. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీల నేతలు రోడ్లమీదకు వచ్చి తన్నుకున్నారు. రక్తాలు కారేట్టుగా.. కర్రలతో బాదుకున్నారు. ప్రధాన పార్టీల మధ్య మాటలు కాస్తా చేతలు దాకా వెళ్లాయి. ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాయి. అర్థరాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేశాయి. రాత్రి సమయంలో కూడా పోలింగ్ సమస్యతో రోడ్లపై బైఠాయింపులు, ధర్నాలు జరిగాయి.

గురువారం ఉదయం ప్రశాంతంగా పోలింగ్ మొదలైనా.. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో అలజడి ప్రారంభమైంది. మధ్యాహ్నం దాకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగకపోవడంతో నేతల్లో అసహనం పెంచింది. దీంతో ఈవీఎంలపై ప్రతాపం చూపేలా చేసింది.

ఒకచోట రాళ్లతో దాడులు.. మరోచోట కర్రలతో కొట్లాటలు.. ఇంకోచోట వేటకొడవళ్లతో దాడులు.. అన్నదమ్ముల్లా మెలిగే గ్రామస్తులు కత్తులు దూసుకున్నారు. చొక్కాలు చించేసుకున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.