
ప్రముఖ ఆంగ్ల పత్రికలో తాను పార్టీ మారబోతున్నానంటూ వస్తున్న వార్తలను టీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. వార్త చివరన ఏప్రిల్ 1 తేదీ సందర్భంగా ఏప్రిల్ ఫూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ విషయంపై స్పందించిన హరీష్ రావు.. ఆ వార్తా కథనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్విట్టర్ వేదికగా సదరు పత్రిక తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ మీడియా సంస్థ నాపై ప్రచురించిన వార్త.. ఫేక్ న్యూస్‌కు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటువంటి చిల్లర వార్తలను ఇంకెప్పుడూ ప్రచురించొద్దని మీడియా సంస్థలను కోరుతున్నాను. ఇదే సమయంలో.. తనపై తప్పుడు వార్తను ప్రచురించిన పేజీలోనే రేపు(మంగళవారం) క్షమాపణలు చెబుతూ మరో వార్తను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా సదరు మీడియా సంస్థను హెచ్చరించారు.
My sincere appeal to the media outlets to not resort to such pranks.
I demand the outlet which carried the #Fakenews item to carry an apology tomorrow on the same page.— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) April 1, 2019